ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “లక్కీ భాస్కర్” కూడా ఒకటి. మరి ఈ సినిమాపై అంచనాలు ట్రైలర్ తర్వాత మరింత ఎక్కువ అయ్యాయి.
ఇక మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ అక్టోబర్ 27 కి కూడా లాక్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఈవెంట్ కి ఎలాగో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తారని తెలిసిందే. మరి తన పేరుతో పాటుగా మరో స్పెషల్ గెస్ట్ పేరుని ఇపుడు మేకర్స్ అనౌన్స్ చేశారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పాటుగా సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా వస్తున్నట్టుగా ఇప్పుడు రివీల్ చేశారు. దీనితో ఈ ఈవెంట్ మంచి కేజ్రీగా జరగబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 31న రిలీజ్ కి రాబోతుంది.
The ROWDY Storm Alert! ????
An absolute stunner and a diligent performer, our Rowdy @TheDeverakonda will be gracing the Pre-release event of our #LuckyBaskhar along with our darling director #Trivikram garu. ????❤️????
????TOMORROW @ JRC Convention Film Nagar, Hyderabad from 6:00 PM… pic.twitter.com/8aqr2M68Bq
— Sithara Entertainments (@SitharaEnts) October 26, 2024