ప్రభాస్ సినిమాకు వీరి పేర్లు ఇంకా అండర్ లో ఉన్నాయా?

Published on Oct 31, 2020 9:12 pm IST


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొత్తం మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కించనున్న ఈ సినిమాపై అటు బాలీవుడ్ మరియు మన తెలుగులో కూడా ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రంలో కీలక పాత్రలు అయినటువంటి రాముడు అలాగే రావణ పాత్రలను ముందుగానే రివీల్ చేసేసిన చిత్ర యూనిట్ తర్వాత మాత్రం ఎందుకో సైలెంట్ అయ్యిపోయారు. అయితే మరో కీలక పాత్ర అయినటువంటి సీత పాత్ర కోసం ఎందరో స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించినా ఆ తర్వాత కృతి సనన్ పేరు వెలుగులోకి వచ్చింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం మొదటి నుంచి అనుకుంటున్నా కియారా అద్వానీ పేరు ఇంకా అండర్ లో ఉండగా ప్రభాస్ తో ఇది వరకు చేసిన శ్రద్ధ కపూర్ పేరు కూడా లైన్ లో ఉన్నట్టు ఇప్పుడు వినికిడి. మరి ఈ రోల్ కు ఎవరిని సెట్ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం :

More