నేడు రిలీజైన బాలీవుడ్ బిగ్గీల పరిస్థితి ఇదే!

Published on Aug 11, 2022 9:00 pm IST

ఈరోజు, రాఖీ పండుగ సందర్భంగా, ఇద్దరు స్టార్ హీరోల బాలీవుడ్ బిగ్గీలు చాలా హైప్‌తో భారీగా థియేటర్ల లో విడుదలయ్యాయి. కానీ పాపం, ఇద్దరికీ ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా అమీర్ లాల్ సింగ్ చద్దా దేశ వ్యాప్తంగా షాకింగ్‌గా తక్కువ ఆక్యుపెన్సీని చూస్తోంది. మౌత్ టాక్ బావుంది కాబట్టి ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

నేడు విడుదలైన మరో చిత్రం అక్షయ్ కుమార్ రక్షా బంధన్. ఈ చిత్రానికి ఆక్యుపెన్సీ కూడా తక్కువే. అయితే సమీక్షలు మరియు మౌత్ టాక్ పెరుగుతున్నందున ఈవినింగ్ షోల నాటికి ఆక్యుపెన్సీలో వృద్ధిని ట్రేడ్ అంచనా వేస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఈ రెండు చిత్రాలు చివరగా ఎలాంటి వసూళ్లను రాబడతాయి అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :