ప్రస్తుతం డివైడ్ టాక్ తో కూడా ఓ రేంజ్ లో వసూళ్లు రాబడుతున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో చేసిన భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (The Greatest Of All Time) సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదటి షో నుంచే టాక్ వేరేలా వచ్చింది కానీ విజయ్ తన స్ట్రాంగ్ జోన్స్ తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్ నుంచి మాత్రం భారీ వసూళ్లు రాబడుతున్నాడు.
అయితే ఈ చిత్రం విషయంలో చూసిన ఆడియెన్స్ కి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వారిలో ఈ చిత్రం హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ కి కాపీ అని ఫస్ట్ లుక్ చూసే అన్నారు. కానీ దర్శకుడు వాటిని కొట్టి పారేసి చివరికి సినిమాలో అదే చూపించాడు. అయితే ఇది విజయ్ కోసం చేసిన మార్పో ఏమో కానీ ఈ చిత్రానికి మొదటిగా రెండు రోల్స్ కి వెంకట్ ప్రభు విజయ్ ని హీరోగా అనుకోలేదు అని తెలిసిందే.
తాను మొదటిగా ఓల్డ్ విజయ్ పాత్రకి సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ని, యంగ్ విజయ్ పాత్రకి ధనుష్ (Dhanush) ని అనుకున్నాను అని తెలిపాడు. మరి ఈ ఇద్దరే సినిమా చేసి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది ఏమో అని చెప్పాలి. ఎక్కువ వి ఎఫ్ ఎక్స్ తో కూడా పని లేకుండా మరింత మాస్ లెవెల్లో వచ్చి ఉండేది అని చెప్పొచ్చు. మరి మొత్తానికి ఈ ఇద్దరూ ఎలాగో భాగం కాకపోయేసరికి రెండూ విజయ్ నే చేసాడు. పలు ట్రోల్స్ కి కూడా గురయ్యాడు కానీ ఫైనల్ గా తన స్టార్ పవర్ తో భారీ వసూళ్లు రాబడుతున్నాడు.