మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు విజువల్ వండర్ ట్రీట్ చిత్రాల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా ఆలీయా భట్ హీరోయిన్ గా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం “బ్రహ్మాస్త్ర” కూడా ఒకటి. మరి తెలుగులో కూడా అగ్రెసివ్ ప్రమోషన్స్ తో “బ్రహ్మాస్త్రం” గా రిలీజ్ చేసిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. అయితే సినిమాలో కంటెంట్ కొంచెం వీక్ అయినప్పటికీ సినిమాలో విజువల్స్ మాత్రం మూవీ లవర్ మైండ్ బ్లాక్ చేసాయి.
ఇక ఈ చిత్రానికి మేకర్స్ పార్ట్ 2 గా “బ్రహ్మాస్త్రం – దేవ్” ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పార్ట్ లో దేవ్ గా ఎవరు కనిపిస్తారు అనేది ఎప్పుడు నుంచో మంచి ఎగ్జైటింగ్ గా మారింది. దీనిపై చాలా మంది పేర్లు వచ్చాయి కానీ ఇప్పుడు మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ పేర్లు కూడా వైరల్ గా మారాయి.
మరి వారే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మరొకరు టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ అట. ఇద్దరికిద్దరూ సాలిడ్ పర్సనాలిటీతో కనిపిస్తారు. అలాగే నెగిటివ్ షేడ్ ని పండించడంలో అయితే రణ్వీర్ దిట్ట. మరి వీరిలో ఎవరు కనిపించినా ఆ పాత్ర మరింత బలంగా ఎలివేట్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ బజ్ లో ఎంతవరకు నిజముందో వేచి చూడాలి.