ప్రభాస్ సినిమాకు ఈ పనులు శరవేగంగా.!?

ప్రభాస్ సినిమాకు ఈ పనులు శరవేగంగా.!?

Published on Apr 12, 2021 9:01 PM IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” మరియు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో “ఆదిపురుష్” అనే మరో భారీ ఇతిహాస చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు భారీ చిత్రాల షూట్స్ లో ఏక కాలంలో నటిస్తున్న ప్రభాస్ ఇంకా మరో భారీ సినిమా కూడా చెయ్యాల్సి ఉంది.

అదే దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫాంటసీ చిత్రం. దీనిపై కూడా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ చిత్రానికి చెండియాన్ ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ శరవేగంగా జరుగుతున్నాయట..

అంతే కాకుండా ప్రభాస్ సెట్స్ లో అడుగు పెట్టడానికి అవసరం ఉన్న భారీ సెట్ వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యినట్టు మరో టాక్ తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని అశ్వనీ దత్ 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు