వాళ్ళు నా అచీవ్‌మెంట్ – చిరంజీవి

వాళ్ళు నా అచీవ్‌మెంట్ – చిరంజీవి

Published on Jan 6, 2025 10:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సహా తన ఫ్యామిలీలో ఉన్న బిడ్డలంతా తాను సాధించిన అచీవ్‌మెంట్స్ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు నాతో ఒక మాట అన్నాడు. అన్నయ్య నువ్వు ఒక మాట అనేవాడివి గుర్తుందా ?, మనది మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ అవ్వాలనేవాడివి. నీ మాట మంత్రంలా పనిచేసి ఇప్పుడు 9, 10 మంది ఉన్నాం. నీ మాటకు బలం ఎక్కువ అని చెప్పాడు అని పవన్ నాతో అన్నాడు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది’ అని మెగాస్టార్ తెలిపారు.

మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు స్కూల్‌లో ఉన్నప్పటి నుంచే ఏదో ఒకటి సాధించాలని ఉండేది. ఐతే, కాలేజీలో అనుకోకుండా ఓ నాటకం వేశాక అందరూ నన్ను హీరోలా చూశారు, అప్పుడే నాకు నటనపై ఆసక్తి పెరిగింది. ఎదగాలంటే నెగటివిటీకి, వ్యసనాలకు దూరంగా ఉండాలని మెగాస్టార్ యువతకు సూచించారు. పరిస్థితులను అనుకూలంగా మల్చుకుని నేను ఎదుగుతూ వచ్చాను అంటూ ‘ఈగల్ ఫిలాసఫీ’ని చిరు వివరించారు. మొత్తానికి చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు