‘విరాటపర్వం’లో వాళ్ళే కీలకం !

‘విరాటపర్వం’లో వాళ్ళే కీలకం !

Published on Oct 19, 2020 12:00 AM IST

డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’ రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాట పర్వం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘విరాటపర్వం’ ఉమెన్‌హుడ్‌ కి ఒక నివాళిలా ఉంటుందట. అంటే ఈ సినిమాలో రానా పాత్ర తర్వాత కథలో ఉన్న శక్తిమంతమైన పాత్రలన్నీ మహిళలవేనట. సాయిపల్లవి, నందితాదాస్‌, ప్రియమణి, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు ఆ పాత్రలకు మరింత జీవ శక్తినిచ్చారని, ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి వాళ్ళ పాత్రలు చాల కీలకంగా ఉంటాయట.

కాగా 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాలో రానా నక్షలైట్ నటిస్తుండగా.. సాయి పల్లవి జానపద గాయనిగా మరియు కొన్ని సన్నివేశాల్లో నక్సలైట్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. ఆ రోజుల్లో తెలుగు రాష్టాల్లో చోటు చేసుకున్న కొన్ని కీలక అంశాల గురించి ఈ సినిమాలో ఉంటాయట. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు