OG: ‘ట్రాక్’ లోకి పవన్ “ఓజి”.. మ్యాడ్ బాయ్స్ తో క్రేజీ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న అవైటెడ్ బిగ్ ప్రాజెక్ట్ “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ చిత్రం కూడా రీస్టార్ట్ కాబోతుండగా రీసెంట్ గా ఈ సినిమాలో ప్రముఖ నటుడు శింబు సాంగ్ పాడుతున్నాడని వార్తలు బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఈ కాంబినేషన్ పై ఇచ్చేసారు. శింబుతో దర్శకుడు సుజీత్ సంగీత దర్శకుడు థమన్ తో పిక్ షేర్ చేశారు. దీనితో ఓజి లో శింబు వోకల్స్ తో అదిరే సాంగ్ ని ఇపుడు రికార్డు చేయబోతున్నారని చెప్పాలి. మరి థమన్, శింబు కాంబినేషన్ లో సాలిడ్ సాంగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక ఓజి లో ఎలాంటి ట్రాక్ ఉండబోతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version