తిరువీర్ కొత్త సినిమా టైటిల్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’!

తిరువీర్ కొత్త సినిమా టైటిల్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’!

Published on Oct 10, 2024 6:39 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన నటించిన మసూద, పరేషాన్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

తిరువీర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ని టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సినిమాకు ‘‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో తిరువీర్ ఓ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తాడని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయనుండగా.. సందీప్ అగరం, అస్మిత రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాలో క‌మిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య క‌థానాయిక‌గా నటిస్తోంది. ముహూర్తం స‌న్నివేశానికి రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగ‌రం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాను స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన రానా గారికి, ఇత‌ర సినీ పెద్దలు, ప్రముఖులకు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్యవాదాల‌ను తెలియ‌జేస్తున్నాను. కామెడీ డ్రామా జోన‌ర్‌లో సినిమాను రూపొందిస్తున్నాం. ద‌ర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కొత్త పాయింట్‌తో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం.’’ అని అన్నారు.

ద‌ర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా కామెడీ డ్రామా మూవీగా అలరించనుంది. నవంబర్ 7 నుంచి ఎస్‌.కోట‌, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌బోతున్నాం. అవ‌కాశం ఇచ్చిన హీరో తిరువీర్‌గారికి, నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితారెడ్డిగారికి ధ‌న్యవాదాలు’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు