“కల్కి 2” లో అతడి పాత్ర కొనసాగింపు?


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అవైటెడ్ చిత్రం “కల్కి 2898 ఎడి” అని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ఎన్నో అంచనాలు నడుమ వచ్చి సాలిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రానికి కూడా పార్ట్ 2 ఉందని కన్ఫర్మ్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ కొనసాగింపు చిత్రంలో యంగ్ నటుడు దుల్కర్ సల్మాన్ మళ్లీ కనిపిస్తాడు అని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈసారి దుల్కర్ పాత్ర మహా భారతంలో కనిపిస్తుంది అని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో కమల్, అమితాబ్ లాంటి దిగ్గజాలు కూడా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు అలాగే వైజయంతి మూవీస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version