“కల్కి” ఫైనల్ ట్రైలర్.. ఈ విషయంలో డిజప్పాయింట్మెంట్?

“కల్కి” ఫైనల్ ట్రైలర్.. ఈ విషయంలో డిజప్పాయింట్మెంట్?

Published on Jun 22, 2024 8:58 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో దీపికా పడుకోణ్, దిశా పటాని సహా మరింతమంది అగ్ర తారలు నటిస్తుండగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. మరి ఈ సినిమా విషయంలో మేకర్స్ అభిమానులని వెయిట్ చేయిస్తే చేయిస్తున్నారు కానీ సాలిడ్ కంటెంట్ తో మంచి ట్రీట్ ఇస్తున్నారు.

అలా నిన్న సినిమా అవైటెడ్ ఫైనల్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చేయగా ఇందులో సరికొత్త విజువల్స్ కి అయితే ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ ట్రైలర్ తో మాత్రం ఒక విషయంలో అభిమానులు సహా సినిమా కోసం ఎదురు చూస్తున్న జెనరల్ ఆడియెన్స్ కూడా డిజప్పాయింట్ అయినట్టు చెబుతున్నారు.

ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ ట్రాక్ వర్కౌట్ కాలేదని అంటున్నారు. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ డిజప్పాయింట్ చేసాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అయితే ఫస్ట్ ట్రైలర్ కి తాను ఎలాంటి వర్క్ అందించాడో చూసాం సో తనని తక్కువ అంచనా వెయ్యడానికి లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు