‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌కు ఇదొక్కటే బ్యాలెన్స్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమాను తొలుత సంక్రాంతి 2025 కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కోసం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు సమ్మర్ బరిలో ఈ సినిమాను తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ డీల్‌ను కూడా క్లోజ్ చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతుండటంతో ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు అమ్మాలని మేకర్స్ చూస్తున్నారట.

ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు జీ స్టూడియోస్ కూడా విశ్వంభర చిత్ర యూనిట్‌తో చర్చలు జరుపుతోందట. ఒక్కసారి యూవీ క్రియేషన్స్ ఈ డీల్‌ను క్లోజ్ చేయగానే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడం ఖాయమని మేకర్స్ అంటున్నారు. మరి నిజంగానే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌కు ఇదొక్కటే బ్యాలెన్స్ ఉందా.. అనేది వేచి చూడాలి.

Exit mobile version