ర‌వితేజ‌ అలాంటి బ్యాక్ డ్రాప్ తో వ‌స్తాడా..?

ర‌వితేజ‌ అలాంటి బ్యాక్ డ్రాప్ తో వ‌స్తాడా..?

Published on Jun 18, 2024 12:07 PM IST

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో అభిమానుల్లో ఈ సినిమాపై సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి షోరీల్ వీడియో గ్లింప్స్ ను మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ల‌భించింది.

అయితే, ఈ సినిమా త‌రువాత ర‌వితేజ కెరీర్ లోని 75వ సినిమాలో న‌టించ‌నున్నాడు. ద‌ర్శ‌కుడు భాను బోగ‌వ‌ర‌పు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మ‌య్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించి సినీ స‌ర్కిల్స్ లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ట‌. ఇది అర‌కు లోని అడవి బ్యాక్ డ్రాప్ తో రానుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ర‌వితేజ పాత్ర చాలా ప‌వ‌ర్ఫుల్ గా ఉండ‌నుంది.

కాగా, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీం అందించ‌నున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్లపై నాగ వంశీ, సాయి సౌజ‌న్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ను అతి త్వ‌ర‌లో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మ‌వుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు