‘క’ చిత్రాన్ని ఓవర్సీస్‌లో రిలీజ్ చేసేది వీరే!

‘క’ చిత్రాన్ని ఓవర్సీస్‌లో రిలీజ్ చేసేది వీరే!

Published on Oct 1, 2024 8:03 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా సుజిత్, సందీప్‌లు డైరెక్ట్ చేస్తుండగా.. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరికొత్త పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాను కిరణ్ అబ్బవరం తన హోం బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తుండటంతో సినీ సర్కిల్స్‌లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్‌ను శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాలో తన్వీ రామ్, నయన్ సారిక తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు