బిగ్ బాస్ 4 – ఈ కంటెస్టెంట్ గ్రాఫ్ మారిందా.?

Published on Nov 27, 2020 7:04 pm IST

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్లో కూడా చివరి స్టేజ్ కు చేరువ అవుతుంది. ఇక ఇదే నేపథ్యంలో ఫైనల్స్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇపుడు మిగిలి ఉన్న కొద్ది మంది కంటెస్టెంట్స్ కోసం కూడా ఇప్పటికీ చాలానే విషయాలను వీక్షకులు గమనించేసారు.
కానీ అది బిగ్ బాస్ ఏ క్షణాన అయినా ఏదన్నా మారొచ్చు.

అలా ఈ రెండు వారాల్లోనే చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఓ కంటెస్టెంట్ గ్రాఫ్ మాత్రం ఇపుడు అనూహ్యంగా పెరుగుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఆ కంటెస్టెంటే మోనాల్ గజ్జర్. అసలు ఈమె ఇప్పటి వరకు ఎలా కొనసాగింది అన్నదే చాలా మందికి అర్ధం కానీ ప్రశ్న కానీ ఈ రెండు వారాల ఎపిసోడ్స్ లో మాత్రం మోనాల్ కు కాస్త పాజిటివ్ వైబ్స్ ఎదురయ్యాయి. దీనితో ఇప్పుడు ఈమె చివరి స్థానం నుంచి ఓ మెట్టు పైకెక్కినట్టు తెలుస్తుంది. దీనితో ఇపుడు ఈమె కూడా షోలో కీలకం అయ్యింది.

సంబంధిత సమాచారం :

More