తెలుగు స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 వచ్చి దాదాపు రెండున్న నెలల దాటేసింది. కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్న ఈ గ్రాండ్ షోలో ప్రతీ వారాంతం ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ వారాంతం కూడా ఎలిమినేషన్ ఉంది.
అయితే ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో మెహబూబ్ దిల్ సే అలాగే అరియానా డేంజర్ జోన్ లో ఉన్నారని అని ఇంతకు ముందే ఇన్ఫార్మ్ చేసాము. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకెళ్లిపోయే కంటెస్టెంట్ ఎవరు అన్నది తెలుస్తుంది.
ఆమెనే ఈ షో మొట్ట మొదటి కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్. మోనాల్ విషయంలో ఇప్పటికీ చాలా మంది వీక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. మొత్తానికి ఈమె ఇపుడు బిగ్ బాస్ ఇంటి నుంచి వైదొలగనున్నట్టు సమాచారం. మరి ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా లేక వేరే ఎవరన్నానా అన్నది చూడాలి.