“బిగ్ బాస్” హౌస్ లో ఈ కంటెస్టెంట్ బుక్కయ్యాడుగా.!

Published on Oct 18, 2020 5:27 pm IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుని నాలుగో సీజన్లో కూడా రెట్టింపు స్పీడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతుంది. స్టార్టింగ్ లో పెద్ద గొప్పగా అనిపించకపోయినా ఉన్న కొద్దీ మాత్రం మంచి ఆసక్తికరంగా మారింది.

ఇక సగానికి చేరుకున్న ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ కు సంబంధించి ఒక్కొక్కరి పై ఒక అభిప్రాయం ఆడియెన్స్ లో కలుగుతుంది. కానీ ఇప్పటికీ మాత్రం ఓ కంటెస్టెంట్ తన రియాలిటీని బయటపెట్టడానికి ఇష్టపడడం లేదు. ఇదే విషయంలో అతను దొరికేసాడు కూడా. అతడే నోయెల్.

ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టక ముందు చాలా మందికి తెలుసు కానీ వ్యక్తిగా మాత్రం బిగ్ బాస్ చూపించింది. ఇదే విషయాన్ని నిన్న ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున కూడా అడిగేసారు. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ వీక్షకులు మధ్య హాట్ టాపిక్ గా నడుస్తుంది. దీనితో నోయల్ అడ్డంగా బుక్కయ్యినట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం :

More