ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి ప్రతి వారం కూడా ఒకటికి మించే ఎక్కువ సినిమాలు విడుదల అవుతున్నాయి. దీనితో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఆడియెన్స్ కి ఇండస్ట్రీ నుంచి వస్తుంది. మరి అలా వచ్చే వారం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “థ్యాంక్ యూ” కూడా ఒకటి.
అయితే మేకర్స్ నిన్న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చెయ్యగా అందులో చైతూ డైలాగ్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. “ఒక మనిషి పట్టుకొని వేలాడే ప్రేమ కన్నా స్వేచ్ఛగా వదిలేసే ప్రేమే ఎంతో గొప్పది” అని ఉంటుంది. ఇది మాత్రం పర్టిక్యులర్ గా సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో అక్కినేని ఫ్యాన్స్ లో బాగా వైరల్ అవ్వడం మొదలయ్యింది. మరి దీనికి పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి కానీ మొత్తానికి అయితే ఈ ఒక్క డైలాగ్ బాగా అందరిలో వినిపిస్తుంది.