మోక్షజ్ఞ రెండో సినిమా దర్శకుడు అతనే !

మోక్షజ్ఞ రెండో సినిమా దర్శకుడు అతనే !

Published on Dec 2, 2024 1:58 PM IST

నటసింహం బాలయ్య బాబు వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదటి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడు మోక్షజ్ఞ రెండో సినిమా పై క్లారిటీ వచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన “లక్కీ భాస్కర్” సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి – మోక్షజ్ఞ కలయికలో సినిమా సెట్ అయ్యిందట.

ఇప్పటికే, మోక్షజ్ఞ కోసం వెంకీ అట్లూరి ఓ కథ కూడా రాసినట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ నిర్మించబోతుంది. ఈ సినిమా పై ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ, నందమూరి అభిమానులు ఈ పుకార్లు నిజమవుతాయని ఆసక్తిగా ఉన్నారు. ఏది ఏమైనా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు