ఇంట్రెస్టింగ్..ఇదంతా “పుష్ప” హిట్ ఎఫెక్టేనా..!

Published on Jan 19, 2022 7:03 am IST

ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా టోటల్ పాన్ ఇండియా వైడ్ సినిమా ఇండస్ట్రీ దగ్గర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చూస్తూనే ఉన్నాము. “బాహుబలి” హిట్ తో పాన్ ఇండియా బ్యారియర్స్ దాటుకున్న సౌత్ ఇండియా సినిమా ముఖ్యంగా మన తెలుగు సినిమానే అద్భుతమైన ఆదరణను అందుకుంటుంది. దీనితో ఆటోమాటిక్ గా సౌత్ ఇండియన్ సినిమా వైపు ప్రపంచం అంతా చూస్తుంది.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా పాన్ ఇండియన్ మార్కెట్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యిన చిత్రం “పుష్ప” తరువాత పరిణామాలు మరింత మారాయని చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిందీ మార్కెట్ లో అందుకున్న విజయం తో మరిన్ని సౌత్ ఇండియన్ సినిమాలు హిందీలో థియేట్రికల్ గా రిలీజ్ అవ్వడానికి పూనుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుగు మరియు తమిళ భాషల్లో భారీ బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచిన చిత్రాలను ఆయా చిత్ర నిర్మాతలు హిందీలో రిలీజ్ చెయ్యడానికి సిద్ధం చేస్తున్నారు. మరి ఇదంతా పుష్ప హిట్ ఎఫెక్ట్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :