మహేష్ చాలా ఇంటెలిజెంట్ అబ్బా..!

Published on Jul 4, 2020 7:02 pm IST


సరిలేరు నీకెవ్వరు మూవీ కోసం ఎప్పుడూ లేని విధంగా ప్రమోషనల్ కార్యక్రమాలలో మహేష్ పాల్గొన్నారు. మూవీ ఫలితం తరువాత విజయోత్సవ వేడుకలలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ తరువాత ఫ్యామిలీతో కలిసి ఓ జాలీ ట్రిప్ వేశారు. ఇక కరోనా వైరస్ ఇండియాకి చేరినప్పటి నుండి ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. అలాగే ఆయన ప్రకటించిన కొత్త మూవీ సర్కారు వారి పాట మూవీ షూటింగ్ మొదలవడానికి కూడా సమయం పట్టేలా కనిపిస్తుంది.

దీనితో మహేష్ తన భార్య నమ్రతతో కలిసి కొత్త బిజినెస్ ఆలోచనలు చేస్తున్నారట. ఇప్పటికే థియేటర్స్, గార్మెంట్స్, చిత్ర నిర్మాణం వంటి పరిశ్రమలలోకి అడుగుపెట్టిన మహేష్ ఏదైనా ట్రెండీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనే ప్లాన్స్ వేస్తున్నారట. దినదినాభివృద్ధి చెందుతున్న ఓ టి టి పై వీరికి ఎక్కువ ఆసక్తి ఉందని సమాచారం. ఓ టి టి లో సక్సెస్ అయితే కోట్ల బిజినెస్ జరుగుతుంది. దీనితో ఓ కొత్త ఓ టి టి ప్లాట్ ఫార్మ్ స్థాపించే ఆలోచనలో ఆయన ఉన్నారట.

సంబంధిత సమాచారం :

More