“ఓజి” లో ప్రియాంక రోల్ ఇదే..

“ఓజి” లో ప్రియాంక రోల్ ఇదే..

Published on Aug 14, 2024 7:10 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. మరి దీనిపై భారీ హైప్ ఎప్పటి నుంచో ఉంది. ఇలా ఈ భారీ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలై పూర్తి చేసుకోనుంది. అయితే ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ హీరోయిన్ ప్రియాంక నటిస్తున్న విషయం తెలిసిందే.

మరి ఈమె ఈ చిత్రంలో పోషిస్తున్న పాత్ర పేరు ఏంటి అనేది రివీల్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈమె అలకనందగా కనిపించనుండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక ఒక డాక్టర్ గా కనిపిస్తుందట. ఇలా పవన్ రోల్ కి పరిచయం అవుతుంది అని వీరి నడుమ బ్యూటిఫుల్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. మొత్తానికి అయితే సుజీత్ సాలిడ్ యాక్షన్ తో పాటుగా మంచి రొమాంటిక్ సీన్స్ కూడా డిజైన్ చేశాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు