ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ కంపెనీ నేమ్ అదే.. !

ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ కంపెనీ నేమ్ అదే.. !

Published on Mar 22, 2020 9:02 AM IST

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ నిర్మాతలుగా మారిన నేపథ్యంలో ఎన్టీఆర్ సైతం నిర్మాతగా మారనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ కళ్యాణ్ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండగా ఎన్టీఆర్ కూడా ఈ సారి వాటా తీసుకున్నారని తెలుస్తుంది. కాగా ఎన్టీఆర్ తన తండ్రి గారైన హరికృష్ణ పేరు మీద ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలని ఆలోచన ఉన్నారట నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ పేరుతో ఆయన ఓ బ్యానర్ స్థాపించాలనే ఆలోచనలో ఉన్నారట.

త్రివిక్రమ్ సినిమా తరువాత నుండి ఎన్టీఆర్ తాను నటించే ప్రతి సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉండాలని భావిస్తున్నారట. తన తండ్రిగారైన హరి కృష్ణ పేరు మీద ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలని అనుకుంటున్నారట. ఇక భవిష్యత్ లో ఎన్టీఆర్ నటించే అన్ని చిత్రాలు ఎన్ హెచ్ కే బ్యానర్ లో రూపొందనున్నాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 8, 2021లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు