‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌కు కియారా అందుకే రాలేదా..?

‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌కు కియారా అందుకే రాలేదా..?

Published on Jan 5, 2025 2:57 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో నిర్వహిస్తున్నారు.

అయితే, ఈ ప్రమోషన్స్‌కు హీరోయిన్ కియారా అద్వానీ దూరంగా ఉంది. దీంతో ఆమె ఎందుకు ఈ ప్రమోషన్స్‌కు దూరంగా ఉందా అని అందరూ అనుకుంటున్నారు. కాగా, తీవ్రంగా పని ఒత్తిడి కారణంగా కియారా అలిసిపోయిందని.. ఆమెను డాక్టర్లు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.

దీంతో ఆమె ముంబైలో జరిగిన ఈవెంట్, రాజమండ్రిలో జరిగి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనలేదు. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర అభిమానులను అలరించే విధంగా ఉండబోతుందని.. చరణ్‌తో ఆమె కెమిస్ట్రీ అభిమానులకు ట్రీట్‌లా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు