‘వకీల్ సాబ్’ రీస్టార్ట్ అయ్యేది ఇక్కడే !

Published on Oct 25, 2020 7:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఓ భారీ కోర్టు సెట్ వేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సెట్ పని దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. కాగా త్వరలో మొదలుకాబోయే షెడ్యుల్ లోని మిగిలిన షూటింగ్ మొత్తం ఈ సెట్ లోనే షూట్ చేయనున్నారట. నిజానికి మధ్యలో అగకపోయి ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయి ఎప్పుడో మేలోనే రిలీజ్ అయిపోయి ఉండేది.

కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు ఈ సినిమా బాగా ఆలస్యం అయింది. పైగా పవన్ చేయాలనుకున్న సినిమాలన్నీ ప్రస్తుతానికి మధ్యలోనే ఆగాయి. మరోపక్క థియేటర్స్ ఓపెన్ అవుతోన్న క్రమంలో మేకర్స్ అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెట్టేస్తున్నారు కాబట్టి.. పవన్ కూడా వకీల్ సాబ్ షూట్ లో పాల్గొంటానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అలాగే పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారట.

సంబంధిత సమాచారం :

More