మహేష్ సెంటిమెంట్…ఆ వేడుకకు రాడు..!

Published on Nov 21, 2020 10:14 pm IST

హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్నారు సూపర్ స్టార్ మహేష్. సరిలేరు నీకెవ్వరు మూవీతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్, దర్శకుడు పరుశురామ్ తో సర్కారు వారి పాట ప్రకటించారు. కాగా ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నేడు ఉదయం హైదరాబాద్ కే బి హెచ్ బి కాలనీలోని విశ్వనాథ ఆలయంలో ప్రారంభం అయ్యింది.

మహేష్ కూతురు సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. హైదరాబాద్ లో ఉండి కూడా మహేష్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనికి కారణం సెంటిమెంట్ అని తెలుస్తుంది. టైటిల్స్ తో పాటు అనేక సెంటిమెంట్స్ ఫాలో అయ్యే మహేష్ ఎప్పుడూ లాంఛింగ్ ప్రోగ్రాం కి హాజరుకారు. ఆయన తరపున కుటుంబ సభ్యులు హాజరవుతూ ఉంటారు.

శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాల లాంఛింగ్ ప్రోగ్రామ్స్ కి కూడా మహేష్ హాజరు కాలేదు. మహేష్ ఈ వింత సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

More