అమ్మడు ఒళ్ళు చేసింది అందుకేనా…!

అమ్మడు ఒళ్ళు చేసింది అందుకేనా…!

Published on Sep 28, 2019 7:43 AM IST

హీరోయిన్ నిత్యా మీనన్ అందం కొంచెం తక్కువైనా చక్కని ఆహార్యం, అభినయంతో తెలుగువారికి బాగా దగ్గరైంది. అలా మొదలైంది సినిమాతో మొదలైన నిత్యా టాలీవుడ్ జర్నీ, టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నిత్యా హీరోయిన్ గా చేశారు. కాగా ఇటీవల ఆమె హిందీలో మొదటి సారి నటించిన మిషన్ మంగళ్ మూవీ సూపర్ హిట్ సాధించింది. ఐతే కొంత కాలంగా నిత్యా బరువు పెరుగుతున్నారు.

మామూలుగానే కొంచెం బొద్దుగా ఉండే నిత్యా ఇంకొంచెం లావు అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె లుక్ పై కొందరు నెటిజన్స్ సెటైర్స్ వేయగా నిత్యా వారికి ఘాటుగా సమాధానం చెప్పడం జరిగింది. ఐతే ఆమె కావాలనే బరువు పెరిగారని తాజా సమాచారం. నిత్యా తమిళ రాజకీయ సంచలనం జయలలిత బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్ జయలలిత పాత్ర చేస్తున్నారు. జయలలిత కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి ఆమె లుక్ కొరకు నిత్యా బరువు పెరిగినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు