“డాకుమహారాజ్”లో మరో కీలక అంశం కూడా మంచి హైలైట్ గా

“డాకుమహారాజ్”లో మరో కీలక అంశం కూడా మంచి హైలైట్ గా

Published on Jan 2, 2025 1:01 PM IST

నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం ఒక్క నందమూరి అభిమానులే కాకుండా మాస్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి రేస్ లో ఉన్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి కాగా మేకర్స్ గ్రాండ్ ఈవెంట్ లు అలాగే ఇతర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

అయితే ఇప్పటికే నిర్మాత నాగవంశీ డాకు మహారాజ్ ని ఓ రేంజ్ ఎలివేట్ చేసి మంచి హైప్ ని సెట్ చేశారు. అయితే ఈ సినిమాలో బాలయ్యపై యాక్షన్ సీన్లు, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇలా కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ గా కనిపిస్తాయని ఆల్రెడీ టాక్ ఉంది. కానీ వీటికి ఈ సినిమా క్వాలిటీ ఆడియెన్స్ కి ఇంప్రెస్ చేస్తుందని తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమాలో పెట్టిన నిర్మాణ విలువలు, సినిమాలో కనిపించే విజువల్స్ చాలా గ్రాండ్ గా నాచురల్ గా కనిపిస్తాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ పై ఎలాంటి ట్రీట్ ఇస్తుంది అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు