“ఇండియన్” 2,3 లలో కమల్ ఇన్ని గెటప్స్..!?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా యంగ్ హీరో సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి దాదాపు 25 సంవత్సరాల తర్వాత వస్తున్నా సీక్వెల్ సినిమా ఇది కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొనగా రీసెంట్ గా వచ్చిన సాంగ్స్, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి.

దీనితో ఈ సినిమా కోసం తెలుగు తమిళ్ సహా హిందీ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మేకర్స్ ఇండియన్ 2 తో పాటుగా ఇండియన్ 3 ని కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇండియన్ 2 ఇంకా ఇండియన్ 3 లో కమల్ హాసన్ గెటప్స్ కోసం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం కమల్ ఇండియన్ 2 లో మొత్తం 7 భిన్నమైన గెటప్స్ లో కనిపించనుండగా ఇండియన్ 3 లో మాత్రం 5 గెటప్స్ లో కనిపిస్తారట. ఆల్రెడీ ఇండియన్ 2 ట్రైలర్ కొన్ని పోస్టర్స్ లోనే కమల్ నుంచి రెండు మూడు గెటప్స్ కనిపించాయి. మరి చూడాలి శంకర్ ఈసారి ఏ తరహాలో ప్లాన్ చేశారు అనేది.

Exit mobile version