‘సలార్ 2’లో మరో సూపర్ స్టార్ ?

‘సలార్ 2’లో మరో సూపర్ స్టార్ ?

Published on Sep 9, 2024 11:04 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సలార్ 2లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వార్త గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ప్రభాస్ మరియు మోహన్‌లాల్ ఇద్దరూ స్క్రీన్‌ను పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నారట.

కాగా ఈ సీక్వెల్‌లో నటిస్తున్న శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు శ్రియా రెడ్డి తిరిగి సెట్స్ పైకి రానున్నారు. అన్నట్టు, ఈ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పార్ట్-2ని త్వరగా పూర్తి చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు. మొత్తానికి సలార్ 2తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు