పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ అయితే నిర్విరామంగా కొనసాగుతూ ఉండగా మేకర్స్ నుంచి ఏదన్నా అప్డేట్ కోసం ఈ ఫిబ్రవరి నెలలో అయితే ఫ్యాన్స్ ఎదురు చూసారు.
మరి ఇంట్రెస్టింగ్ గా బన్నీ సన్నిహిత వర్గాలు నుంచి ఈ ఫిబ్రవరి రెండో వారం లోనే తప్పకుండా అప్డేట్ ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి మొత్తం కంప్లీట్ కావచ్చింది కానీ పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ కూడా లేకుండానే కంప్లీట్ అయ్యిపోతుంది అని చెప్పాలి. దీనితో పుష్ప 2 అప్డేట్ కోసం ఎదురు చూసిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
మరి ఇపుడు మిస్ చేసిన అప్డేట్స్ ఎప్పుడు వదులుతారో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహిస్తున్నారు.