వైరల్ : పవన్ ని నవ్వించిన ఈ లేటెస్ట్ సినిమా ట్రైలర్.!

Published on Aug 12, 2022 2:06 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలు మరియు పొలిటికల్ యాత్రలకి కూడా చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు అయితే పవన్ మళ్ళీ అంతా సెట్టయ్యి ఇప్పుడిప్పుడే బయటకి వస్తుండగా లేటెస్ట్ గా తనపై ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ గా మారింది. మరి డీటెయిల్స్ లోకి వెళితే..”పలాస”, “శ్రీదేవి సోడా సెంటర్” సినిమాల దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “కళా పురం” చిత్రం రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

మరి ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అవుతుండగా ఈ ట్రైలర్ ని మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ ని చూసే పవన్ ఆనందంగా నవ్వుకోవడం వైరల్ గా మారింది. ఓ వీడియో ఇప్పుడు జీ స్టూడియోస్ వారు రిలీజ్ చేయగా అందులో ఈ ట్రైలర్ విజువల్స్ చూసి పవన్ హ్యాపీగా నవ్వుకోవడం విజువల్స్ ని బయట పెట్టారు. దీనితో ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రంలో సత్యం రాజేష్ హీరోగా నటించగా కాశీమ రఫీ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :