గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా మన తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ హైప్ దీనిపై నెలకొంది. ఇలా గేమ్ ఛేంజర్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ నే జరిగినట్టుగా తెలుస్తుంది.
అయితే ఏపీ సహా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి గేమ్ ఛేంజర్ ఏకంగా 130 కోట్లకి పైగా టార్గెట్ తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒక్క నైజాం నుంచే 37 కోట్ల మేర బిజినెస్ ని చేస్తే ఆంధ్రలో 70 కోట్లు సీడెడ్ నుంచి 20 కోట్లకి పైగా బిజినెస్ ని గేమ్ ఛేంజర్ చేసిందట. మరి ఈ మొత్తం టార్గెట్ ని గేమ్ ఛేంజర్ కొడుతుందో లేదో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.