‘జైలర్ 2’లో ఈ పవర్ఫుల్ నటుడు కూడా కన్ఫర్మ్.!

‘జైలర్ 2’లో ఈ పవర్ఫుల్ నటుడు కూడా కన్ఫర్మ్.!

Published on Apr 16, 2025 11:06 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా క్రేజీ కంబ్యాక్ ఇచ్చిన చిత్రం “జైలర్”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం తమిళ నాట రెసిర్డులరికార్డులు తిరగరాసింది. అయితే ఈ చిత్రానికి ఇపుడు మేకర్స్ సీక్వెల్ ని కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుగుతుంది.

మరి మొదటి పార్ట్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ఉన్న కారణాల్లో దర్శకుడు నెల్సన్ పలువురు బిగ్ స్టార్స్ ని ఓ రేంజ్ లో హ్యాండిల్ చేయడం అని చెప్పవచ్చు. మెయిన్ గా కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ మాస్ ప్రెజెన్స్ కి అయితే తమిళ్ సహా తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ నటుడు పార్ట్ 2 లో కూడా కనిపించనున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. తన రీసెంట్ సినిమా ప్రమోషన్స్ లో తాను జైలర్ 2 లో కూడా నటిస్తున్నానని తెలిపారు. మరి ఈ సినిమాలో తన రోల్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు