“కార్తికేయ 2” రిజల్ట్ కోసం ఆ కొంతమంది బాగా వెయిటింగ్..!

Published on Aug 12, 2022 4:10 pm IST

ఈ వారం మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి పలు సినిమాలు సిద్ధంగా ఉండగా ఆల్రెడీ రెండు సినిమాలు ఈరోజు తో థియేటర్స్ లోకి వచ్చేసాయి. ఇక ఈ సినిమాలతో పాటు మరో మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆ చిత్రమే “కార్తికేయ 2”. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం మంచి బజ్ ని నెలకొల్పి సిద్ధంగా ఉంది.

మరి నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో కూడా మరింత పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఫలితం కోసం సినిమా యూనిట్ కాకుండా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ముఖ్యంగా నిఖిల్ సింపతైజర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమాని కొందరు ఇక్కడ వరకు తీసుకొచ్చారని నిఖిల్ ఆ మధ్య వాపోయాడు.

దీనితో అలా ఆపాలని చూసిన వారికి డెఫినెట్ గా ఈ చిత్రం మంచి వసూళ్లు, ఓపెనింగ్స్ తో సమాధానం ఇవ్వాలని ఆ కొంతమంది బాగా కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం అంచనాలు అందుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ లో మేకర్స్ ఉన్నారు. మరి ఇది ఎంతమేర నిజం అవుతుంది అనేది తెలియాలి అంటే రేపటికి వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :