మోక్షజ్ఞ కోసం సీనియర్ హీరోయిన్ రానుందా..?


నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ తన తొలి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

మోక్షజ్ఞ నటిస్తున్న ఈ సినిమాలో హీరో తల్లి పాత్ర చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుందట. ఈ పాత్రలో నటించేందుకు చాలా మంది పేర్లు పరిశీలించారట మేకర్స్. అయితే, అలనాటి హీరోయిన్ శోభన అయితే, ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని ఆమెను సంప్రదించారట. చాలా గ్యాప్ తరువాత శోభన టాలీవుడ్‌లో ‘కల్కి 2898 ఎడి’ సినిమాలో నటించింది. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో తల్లి పాత్రకు ఆమెను సంప్రదించడంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

గతంలో నందమూరి బాలకృష్ణతో కలిసి ‘నారి నారి నడుమ మురారి’, ‘మువ్వ గోపాలుడు’ వంటి సినిమాల్లో శోభన నటించింది. ఇప్పుడు బాలయ్య తనయుడితోనూ నటిస్తుందని వార్తలు వస్తుండటంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఆమె నిజంగానే నటిస్తుందా అనే విషయంపై అఫీషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version