లోకేష్ కనగ్ రాజ్ – విజయ్ సినిమాలో ఈ స్టార్ హీరో..?

Published on Aug 11, 2022 7:01 pm IST

ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ క్రేజీ దర్శకుల్లో లోకేష్ కనగ్ రాజ్ కూడా ఒకడు. తన అన్ని సినిమాలు ఒకెత్తు అయితే లేటెస్ట్ గా “విక్రమ్” సినిమాతో మాత్రం లోకేష్ ఓ రేంజ్ లో హై ని కోలీవుడ్ లో ఏ దర్శకుడు ఇవ్వని విధంగా అందించాడు. ఇక దీనితో నెక్స్ట్ మళ్ళీ ఇళయ దళపతి విజయ్ తో “మాస్టర్” అనంతరం సినిమా అనౌన్స్ చేయగా దీనిపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు ఈ సినిమాపైనే ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్రలో నటించనున్నారని ఇప్పుడు టాక్ బయటకి వచ్చింది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ అతి త్వరలోనే వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాని కూడా లోకేష్ నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చెయ్యబోతున్నదనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :