‘పెద్ది’లో ఈ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండనుందట!

‘పెద్ది’లో ఈ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండనుందట!

Published on Apr 15, 2025 4:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ఇప్పటికే ఎలాంటి సాలిడ్ బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండగా రూరల్ స్పోర్స్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రఫ్ లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాను బుచ్చిబాబు అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేసే పనిలో ఉన్నాడట. ఆగస్టులోపు ఈ సినిమాలో రామ్ చరణ్ షూటింగ్ ముగించేస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారట. ఓ రైల్వే స్టేషన్‌లో జరిగే ఈ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండనుందని.. ఈ సినిమాకే హైలైట్ సీక్వెన్స్‌గా దీనిని చిత్రీకరిస్తున్నారట.

ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు