“విశ్వంభర” లో ఆ సీక్వెన్స్ విధ్వంసం..!?

“విశ్వంభర” లో ఆ సీక్వెన్స్ విధ్వంసం..!?

Published on Sep 5, 2024 2:43 PM IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి చాలా కాలం తర్వాత చిరు నుంచి వస్తున్నా స్ట్రైట్ అండ్ విజువల్ వండర్ సినిమా ఇది కావడంతో అంచనాలు కూడా పీక్స్ లో ఉన్నాయి. మరి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ సినిమా క్రేజీ సీక్వెన్స్ సంబంధించి బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ సినిమాలో చిరంజీవిపై ఒక రెక్కల గుర్రంతో సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇది ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇస్తుంది అని ఆ ఎపిసోడ్ ని వశిష్ట క్రేజీ లెవెల్లో డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇలా మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు నుంచో కోరుకుంటున్న భారీ ట్రీట్ ఈ సినిమా తోనే నెరవేరేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్, సురభి పురాణిక్ తదితరులు నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు