మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. మరి అలాగే ఇటీవలే వచ్చిన టీజర్ కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ చిత్రంలో చిరు తో పాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ రోల్ కు గాను ఆ ఆ మధ్యనే చరణ్ షూటింగ్ స్పాట్ లో కూడా అడుగు పెట్టాడు. అయితే మరి ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం చిరు మరియు చరణ్ లు కలిసి నటించే సాలిడ్ సీన్స్ ను వచ్చే నెలలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
భద్రాద్రిలో ఈ చిత్రం షూట్ ను ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన పనులు అన్ని కొరటాల ఇప్పటికే సర్దినట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని ఈ మే 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.