దేవర: ఆ సాంగ్ డైరెక్ట్ గా థియేటర్ల లోనే!?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జనతా గ్యారేజ్ చిత్రం తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇక రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ ఈ చిత్రానికి అద్దిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇప్పటికే సినిమా నుండి రిలీజైన మూడు పాటలు కూడా సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రిలీజైన ప్రచార చిత్రాలు కూడా అందరినీ అలరించాయి. అయితే ఈ చిత్రంలో ఆయుధ పూజ సాంగ్ ను మేకర్స్ డైరెక్ట్ గా థియేటర్లలోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట సినిమాలో కీలకం కావడంతో ఎలాంటి లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేయకుండా, డైరెక్ట్ గా సినిమాతోనే చూసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత ఎన్టీఆర్ చేసిన్న సినిమా కావడం తో భారు హైప్ నెలకొంది. ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version