ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రం నుంచి ఆల్రెడీ రెండు పాటలు వచ్చి భారీ హిట్ కాగా రీసెంట్ గా సామి మాస్ నెంబర్ కూడా వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే ఈ సాంగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచీ ఓ డౌట్ రావొచ్చు..
అసలు ఈ సాంగ్ హిందీ వెర్షన్ కి ప్లాన్ చెయ్యలేదో లేక దాని ప్లేస్ లో వేరే సాంగ్ ఏమన్నా పెడుతున్నారా అన్నది ఆసక్తిగా మారింది. ఉన్నట్లయితే ముందు నుంచే హిందీ ప్రోమోస్ తో కూడా చిత్ర యూనిట్ పాలకరించేవారు కానీ ఈసారి అలాంటిది ఏమీ జరగలేదు ఈసారి ఈ సాంగ్ ని హిందీ వెర్షన్ కి స్కిప్ చేసినట్టే అనుకోవాలేమో..
అసలే ఇప్పుడు సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ పై కాస్త గందరగోళం నెలకొంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా విషయంలో ఏం జరగనుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా సినిమాని తెరకెక్కిస్తున్నారు.


