“ఓజి” నుంచి ఆ సాంగ్ వచ్చాక వేరే లెవెల్లో ఉంటుంది

“ఓజి” నుంచి ఆ సాంగ్ వచ్చాక వేరే లెవెల్లో ఉంటుంది

Published on Jan 8, 2025 10:11 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఓజి” కూడా ఒకటి. మరి పవన్ చేస్తున్న ఇన్ని సినిమాల్లో దీనిపై మాత్రమే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఈ సినిమాపై లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ చెప్పిన మాటలు ఇపుడు వైరల్ గా మారాయి.

కోలీవుడ్ యువ హీరో శింబు ఈ సినిమా కోసం ఓ పవర్ఫుల్ ట్రాక్ ఆల్రెడీ పాడిన సంగతి తెలిసిందే. మరి ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక వేరే లెవెల్లో ఉంటుంది అని థమన్ అంటున్నాడు. ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్ అంటూ సాగే ఈ పాటనే శింబు పాడినట్టుగా థమన్ కన్ఫర్మ్ చేసాడు. మరి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎప్పుడు నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు