“గేమ్ ఛేంజర్” నుంచి ఈ సాంగ్స్ కి స్పెషల్ అప్లాజ్

గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి సంగీత దర్శకునిగా మొదట్లో అంతా ఏ ఆర్ రెహమాన్ ని తీసుకోవాలని అనుకున్నారు. థమన్ విషయంలో మిక్స్డ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

శంకర్ తన మొదటి తెలుగు సినిమా కాబట్టి సంగీతం విషయంలో కూడా టాలీవుడ్ నుంచే తీసుకోవాలని థమన్ ని ఎంచుకున్నా అన్నారు. అయితే ఈ సినిమాకి థమన్ శంకర్ రేంజ్ సాంగ్స్ ఇచ్చాడా అంటే మొదటి రెండు మూడు పాటలకి వినడం వరకు మరీ సూపర్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు.

కానీ లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వచ్చిన మూడు సాంగ్స్ కి మాత్రం ఇపుడు ఆడియెన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. కొండ దేవర, కోప ర్యాప్ మెయిన్ గా అంజలి, రామ్ చరణ్ నడుమ సోల్ ఫుల్ సాంగ్ కి మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దీనితో అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో థియేటర్స్ లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ జనవరి 10 న రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version