ఐకాన్ స్టార్ బాటలోనే ఈ స్టార్ హీరో కూడా..!

Published on Aug 13, 2022 10:01 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ గా ఎలాంటి రీచ్ ని సొంతం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. తన “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఉన్నది అసలైన క్రేజ్ అని ప్రూవ్ చేసుకొని భారీ ఆఫర్స్ దూసుకెళ్తున్నాడు. అయితే రీసెంట్ గానే బన్నీ పలు వరుస ఎండోర్స్ మెంట్స్ కి సైన్ చేసి భారీ మొత్తంలో రెమ్యునరేషన్స్ తన జేబులో వేసుకున్నాడని తెలిసింది.

అయితే వీటిలో మాత్రం ఓ పొగాకు/ మద్యంకి సంబంధించి యాడ్ లో మాత్రం ఎంత ఆఫర్ చేసినా చేయనని చెప్పడం ఆసక్తిగా మారింది. మరి ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఐకాన్ స్టార్ బాటలోనే మరో స్టార్ హీరో తమిళ్ నుంచి శింబు కూడా ఇదే పని చేసాడట. తన సాలిడ్ హిట్ మానాడు తో మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చిన శింబు కూడా ఆల్కహాల్ సంబంధించి వచ్చిన ఓ భారీ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టుగా తమిళ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈ విషయంలో ఇద్దరికీ అభిమానులు కంపేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :