అన్ స్టాపబుల్2: ప్రభాస్ – గోపీచంద్ ఎపిసోడ్‌లో స్టార్ హీరో క్యామియో?

ప్రభాస్ కొద్దిరోజుల క్రితం బాలయ్యతో అన్ స్టాపబుల్2 షోకి షూట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్‌లో ప్రభాస్ సన్నిహితుడు, నటుడు గోపీచంద్ కూడా కనిపించనున్నారు. విశేషమేమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ షోలో చిన్న పోర్షన్‌ లో కనిపించే అవకాశం ఉంది.

టాక్ షోలో అతను ఎలా కనిపిస్తాడు అనేది సస్పెన్స్‌గా ఉంచబడింది. ప్రస్తుతానికి, రామ్ చరణ్ మొదటిసారి తండ్రి కాబోతున్నందున చాలా సంతోషంగా ఉన్నాడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో పై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. లేటెస్ట్ ఎపిసొడ్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version