ప్రభాస్ “ఆదిపురుష్”లో ఈ స్టార్ హీరో లేరట!

Published on Oct 27, 2020 10:43 pm IST


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో హిందీ మరియు తెలుగు భాషల్లో ఏక కాలంలో ప్లాన్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆదిపురుష్”. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్నాళ్ల కితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాపై అప్పట్లోనే వరుస అప్డేట్స్ తో హోరెత్తించిన టీం ప్రభాస్ బర్త్ కు మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం.

ఇక ఇవి పక్కన పెడితే ఈ చిత్రంలో ఒక కీలకమైన రోల్ కు గాను బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ ను అనుకున్నారని ఆ మధ్య గాసిప్స్ వినిపించాయి. మోస్ట్ పవర్ దేవుని పాత్ర పరమ శివుని రోల్ ను అజయ్ పోషించనున్నారని అపుడు టాక్ రాగా అందులో ఎలాంటి వాస్తవం లేదని అజయ్ దేవ్ గన్ టీం చెప్పినట్టు తెలుస్తుంది. అజయ్ కు ఎలాంటి పిలుపు రాలేదని ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని వారు తెలిపారు. సో ఈ భారీ విజువల్ ట్రీట్ సినిమాలో అజయ్ లేనట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More