మళయాల స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఆవేశం మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఫహాద్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. దాదాపు 150 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ లు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ ఈ రీమేక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ చిత్రం కన్ఫర్మ్ అయితే, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.