ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా కూడా అనేకమంది స్టార్స్ నటీనటులు ఇంకా దర్శకులు కూడా ఆయా భాషల్లో ఎంట్రీ ఇస్తూ సినిమాలు చేస్తున్న సంగతి చూస్తున్నాము. అలా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో “జవాన్” (Jawan Movie) తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక దీనితో పాటుగా తాను తెరకెక్కించిన “తేరి” సినిమాని బాలీవుడ్ లో “బేబీ జాన్” (Baby John) అంటూ నిర్మాతగా మారి వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్నారు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నుంచి ఎలాంటి బోల్డ్ సీన్స్ కనిపించలేదు. ఒక్క “సర్కారు వారి పాట” (Sarkaru Vaari Paata) లో తనలోని మాస్ యాంగిల్ కనిపించింది. అయితే ఇప్పుడు మొదటిసారిగా బాలీవుడ్ సినిమా కోసం ఆమె బోల్డ్ సీన్స్ కి కూడా ఓకే చెప్పినట్టుగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాల్సిందే. తాజాగా కీర్తి సురేష్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD) లో బుజ్జి కి డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.